మన ప్రియతమ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర రెడ్డి గారు దుర్మరణం చెందడము యావత్తు ఆంద్ర దేశానికి కోలుకోలేనటువంటి దెబ్బ .ఆయన అహరహం ప్రజల బాగు గురించే శ్రమించారు.చరిత్రలో అపర భగీరతుడుగా
ప్రజల గుండెలలో శాశ్వితముగా స్థానము సంపాదించుకొన్నాడు . ఆయన ఈ సారి పూర్తిగా పరిపాలించిఉంటే
మనకు ఇంకా ఎన్ని మంచి పనులు చేసిఉండేవారో .మనది ప్రధానముగా వ్యవసాయం మీద ఆధార పడినటువంటి
దేశము అయినందువలన ప్రాజెక్టులు పూర్తి అయితే ప్రజలందరు సుభిక్షముగా ఉండేవారు.కానీ " తాను ఒకటి తలుస్తే
దైవము వేరొకటి తలచాడన్నట్లుగా " మనపట్ల విధి చిన్న చూపు చూసింది.
జరిగిన విషయము జీర్నించుకోవదానికే ఇంకా కొంత సమయము
పడుతంది. ఇంకా అంత్యక్రియలు పూర్తి కానేలేదు .అప్పుడే ముఖ్యమంత్రి ఎవరో అని మల్లగుల్లాలు మొదలు అయ్యాయి.పుట్టెడు శోకములో ఉన్న జగన్ ను అనవసరముగా వివాదాల్లోకి లాగుతున్నారు.జగన్ మీద
అందరికి సానుభూతి ఉన్నది . ఇది కాదనలేని నిజము. అయినంతమాత్రాన ఇప్పటి కి ఇప్పుడే ఈవిషయము
గురించి చర్చ అనవసరము.ముఖ్య మంత్రి అంటే ఆషామాషీ కాదు. పరిపాలనలో ఎన్ని ఒడుదుడుకులు ఉంటాయో
అందరికీ తెలిసిందే.దానికి ఎంతో ముందు చూపు కార్యదక్షత అవసరము.గోతికాడ నక్కల్లాంటి రాజకీయనాయకులు ఉండనే ఉన్నారు .తమపబ్బము గడుపుకోవడానికి ఎన్ని ఎత్తులయినా వేసే అపర చాణుక్యులకు కొదవేలేదు .ఇలాంటి పరిస్థితిలో ఆచి తూచి అడుగు వెయ్యాలి. రాజకీయ నాయకుల కుయుక్తులకు జగన్ గారు సరయిన జవాబిస్తారని ఆశిద్దాము.
Thursday, September 3, 2009
Subscribe to:
Post Comments (Atom)
జగన్ వెనక కేవీపీ ఉంటాడు.ఆ ఒక్కడు చాలు.
ReplyDeleteఆయన జవాబు స్పష్టం గానే వుంది. నిన్న, ఈరోజు ఆయన హావ భావాల్లో స్మశాన వైరాగ్యం కన్నా మరేదో కనిపించ లేదా మీకు?
ReplyDelete