Tuesday, September 1, 2009

అవహేలనలపర్వంలో రాలిన కుసుమం

పసిమనసులకు గాయమైతే దాని ఫలితాలు ఎలా ఉంటాయో తెలియ చేసే ఘటన ఒకటి అనంతపురం లో జరిగింది.పొట్టిగా ఉన్నవంటూ తోటి వారు ఎగతాళి చేయడము అవమానము గా తలచిన చక్రధర్ అనే బాలుడు
ఉరి వేసుకొని ఆత్మహత్య చేసికొన్నాడు . ---ఈనాడు ౩౧.౦౮.౨౦౦౯


ఈ వార్తలో మనము బాగా గమనించినట్లయితే పొట్టిగా ఉండడము అతను చేసిన తప్పు కాదు.అలా ఉండడము అతని నేరము కాదు . మరి అతను చేయని తప్పుకు అతను ఎందుకు బలి అవవలిసి వచ్చింది . విధి అని సాంప్రదాయవాదులు అనవచ్చును గాక .ఇందులో అతని చుట్టూ ఉన్నా సమాజము అతనికి చేసిన ద్రోహమే ఇది .
ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపము ఉండక మానదు. ఒకరికి పళ్ళు ఎత్తు ఉండవచ్చు. ఇంకొకరు నల్లగా ఉండవచ్చు.మరొకరు గుడ్డి అయి ఉండవచ్చు , ఇలా ఎన్నోరకమైన శారీరక లోపాలు ఉండవచ్చు.కాని ఆ లోపాలు వారికి శాపాలు కారాదు.అలా కాకూడదంటే వాళ్లు ఆ వికలత్వమును తమ తప్పిదము కాదని
గుర్తించాలి. అలా గుర్తించేటట్లు వారి చుటూ ఉండే మనమంతా ఆ పని చేయాలి. పైకి బహు సుందరము గా ఉంటూ లొలోపల ఎన్నో తప్పుడు పనులు చేసే వారే నిజమైన vikalaangulu. మనము thamaashaku anukuntaamu gaani వారు ఎంత bhadha padathaaro ఈ ఉదంతము చూస్తేనే మనకు అర్థము అవుతుంది
కనుక ప్రతి ఒక్కరు తమంతకు తాముగా ఈ జాడ్యాన్ని రూపు మాపడానికి తమ ప్రయత్నము చేయాలని కోరుతున్నాను .

No comments:

Post a Comment