Tuesday, September 15, 2009

గురుతు పడితే జవాబు ఇవ్వు

ఇది నా మిత్రునికి నేను చెబుతున్న ఆనవాలు . కేవలము నా నేస్తము కోసం నేను వేస్తున్న చీకట్లో బాణం .
౧౯౮౩ సం వత్సరములో మనము నెల్లూరులో హరనాథపురములొ ఎంసెట్ కోచింగ్ తీసుకున్నాము. మన గదిలో
జగన్, వెంకటరమణ ఉండేవారు .నీవు వ్రాసిన ఉత్తరము ఎక్కడ పోయిందో తెలియడములేదు .ఇన్నిరోజుల తరువాత గుర్తుకు తెచ్చుకోవడము చాలా కష్టముగా ఉంది .నీఊరు పూతలపట్టు దగ్గర అని తెలుసు . కాని ఊరి పేరు గుర్తుకు రావడము లేదు . నీవు ఇది చూస్తావన్న నమ్మకము లేదు . కాని ఎలా ప్రయత్నించాలో అర్థము కాక ఈ విధముగా
చేస్తున్నాను. ఏమి అనుకోకే . నీకు జ్ఞాపకము రావడానికి ఒక సంఘటన చెబుతాను . కోచింగ్ అయిన తరువాత
మనము ఎంట్రన్సు వ్రాయడానికి బయలుదేరుతామనగా నీ దగ్గర ఉన్న డబ్బు ఎలాగో పోయింది . అప్పుడు నా దగ్గర ఉన్న డబ్బు సర్దుబాటు చేశాను . ఈ సంఘటన నీకు గుర్తుకు వస్తే నీవు నాకు దొరికినట్లే . నీవు ఊరికి
వెళ్లి వ్రాసిన ఉత్తరము ఎక్కడో పోయింది . అందుకే ఈ చిన్న ప్రయత్నము . నీవు ఖచ్చితముగా ఇంజినీరు అయి ఉంటావు.ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో చూడాలని ఆశగా ఉంది . విధి మనలను కలుపుతుందని ఆశిస్తున్నాను.

Thursday, September 3, 2009

వై. యస్ .జగన్ కు ముఖ్యమంత్రి పదవి .గురించి

మన ప్రియతమ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర రెడ్డి గారు దుర్మరణం చెందడము యావత్తు ఆంద్ర దేశానికి కోలుకోలేనటువంటి దెబ్బ .ఆయన అహరహం ప్రజల బాగు గురించే శ్రమించారు.చరిత్రలో అపర భగీరతుడుగా
ప్రజల గుండెలలో శాశ్వితముగా స్థానము సంపాదించుకొన్నాడు . ఆయన ఈ సారి పూర్తిగా పరిపాలించిఉంటే
మనకు ఇంకా ఎన్ని మంచి పనులు చేసిఉండేవారో .మనది ప్రధానముగా వ్యవసాయం మీద ఆధార పడినటువంటి
దేశము అయినందువలన ప్రాజెక్టులు పూర్తి అయితే ప్రజలందరు సుభిక్షముగా ఉండేవారు.కానీ " తాను ఒకటి తలుస్తే
దైవము వేరొకటి తలచాడన్నట్లుగా " మనపట్ల విధి చిన్న చూపు చూసింది.
జరిగిన విషయము జీర్నించుకోవదానికే ఇంకా కొంత సమయము
పడుతంది. ఇంకా అంత్యక్రియలు పూర్తి కానేలేదు .అప్పుడే ముఖ్యమంత్రి ఎవరో అని మల్లగుల్లాలు మొదలు అయ్యాయి.పుట్టెడు శోకములో ఉన్న జగన్ ను అనవసరముగా వివాదాల్లోకి లాగుతున్నారు.జగన్ మీద
అందరికి సానుభూతి ఉన్నది . ఇది కాదనలేని నిజము. అయినంతమాత్రాన ఇప్పటి కి ఇప్పుడే ఈవిషయము
గురించి చర్చ అనవసరము.ముఖ్య మంత్రి అంటే ఆషామాషీ కాదు. పరిపాలనలో ఎన్ని ఒడుదుడుకులు ఉంటాయో
అందరికీ తెలిసిందే.దానికి ఎంతో ముందు చూపు కార్యదక్షత అవసరము.గోతికాడ నక్కల్లాంటి రాజకీయనాయకులు ఉండనే ఉన్నారు .తమపబ్బము గడుపుకోవడానికి ఎన్ని ఎత్తులయినా వేసే అపర చాణుక్యులకు కొదవేలేదు .ఇలాంటి పరిస్థితిలో ఆచి తూచి అడుగు వెయ్యాలి. రాజకీయ నాయకుల కుయుక్తులకు జగన్ గారు సరయిన జవాబిస్తారని ఆశిద్దాము.

Tuesday, September 1, 2009

జడివాన లో భాగ్యనగరం

వరుణ దేవుడు మా పార్టీ లో చేరాడు అని మన పెద్ద సారు గారు సెలవిచ్చినందుకో ఏమో గాని వాన భాగ్యనగరిని
ముద్ద చేసేస్తోంది .మన వాళ్లకు గతం నుండి నేర్చుకునే అలవాటు చానా తక్కువ . ఇంతకు మునుపు వర్షాలలో
మురికి కాలువలు పొంగి ప్రవహించినది మరచి పోయారో ఏమో .ఇన్ని సంవత్సరాల తరువాత వాన వచ్చిన అదే పరిస్థితి పునరావృతం అవుతోంది .రోడ్ల మీద నడవాల్సిన కార్లు, మోటారు సైకిళ్ళు మురికి కాలువలలో కొట్టుకోనిపోయి నాయి.ఇక మీదట కార్ల కంపెనీళ్ళ వాళ్లు నీటిలోనూ ,నేలమీదా పరుగేతే వాహనాలను తయారు చేసితే మన భాగ్యనగరిలో యమగిరాకి వుంటుందని చెప్పవచ్చు . బయట వాన పడుతూవుంటే ఇంటిలో కూర్చుని వెచ్చగా రగ్గు కప్పుకొని వేడి గా కాఫీ తాగుతూ టీవీ లో
మంచి పాటలు చూస్తా ఉంటే ఆహాయి , అహో అనిపిస్తుంది కదూ .
కానీ నాకు మాత్రము కరవు పేరు చెపితే జిల్లా గురుతుకు వస్తుందో అదే గురుతుకు వస్తోంది . మీరు ఊహించింది నిజమే .అదే అనంతపురం జిల్లా . ఇప్పుడు వర్షము వస్తున్నందుకు బాధపదవలేనో , సంతోష పడవలేనో
అర్థము కాని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు . జిల్లలో ప్రధానంగా వేరుశనగ వర్షాధారంగా సాగు చేస్తారు . సమయానికి వాన రాకపోవదముతో అప్పోసప్పో చేసికోన్నటువంటి విత్తనాలను అమ్మివేశారు . ఇప్పుడు వాన వచ్చింది .కాని చేతి లో ఉన్న విత్తనము కాయలును తేగానమ్ముకున్న రాయలసీమ రైతు కష్టాలు పగవాడికి కూడా రాకూడదు .గుడ్డిలో మెల్ల ఏమిటంటే కన్నబిడ్డలుగా సాకినటువంటి పశువులను కబెలాకు అమ్మే బాధ
తప్పుతుంది .పిలుస్తే వచ్చేవాడు చుట్టమయితే పిలవకుండా వచ్చేది మాకు కరువే .

అవహేలనలపర్వంలో రాలిన కుసుమం

పసిమనసులకు గాయమైతే దాని ఫలితాలు ఎలా ఉంటాయో తెలియ చేసే ఘటన ఒకటి అనంతపురం లో జరిగింది.పొట్టిగా ఉన్నవంటూ తోటి వారు ఎగతాళి చేయడము అవమానము గా తలచిన చక్రధర్ అనే బాలుడు
ఉరి వేసుకొని ఆత్మహత్య చేసికొన్నాడు . ---ఈనాడు ౩౧.౦౮.౨౦౦౯


ఈ వార్తలో మనము బాగా గమనించినట్లయితే పొట్టిగా ఉండడము అతను చేసిన తప్పు కాదు.అలా ఉండడము అతని నేరము కాదు . మరి అతను చేయని తప్పుకు అతను ఎందుకు బలి అవవలిసి వచ్చింది . విధి అని సాంప్రదాయవాదులు అనవచ్చును గాక .ఇందులో అతని చుట్టూ ఉన్నా సమాజము అతనికి చేసిన ద్రోహమే ఇది .
ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపము ఉండక మానదు. ఒకరికి పళ్ళు ఎత్తు ఉండవచ్చు. ఇంకొకరు నల్లగా ఉండవచ్చు.మరొకరు గుడ్డి అయి ఉండవచ్చు , ఇలా ఎన్నోరకమైన శారీరక లోపాలు ఉండవచ్చు.కాని ఆ లోపాలు వారికి శాపాలు కారాదు.అలా కాకూడదంటే వాళ్లు ఆ వికలత్వమును తమ తప్పిదము కాదని
గుర్తించాలి. అలా గుర్తించేటట్లు వారి చుటూ ఉండే మనమంతా ఆ పని చేయాలి. పైకి బహు సుందరము గా ఉంటూ లొలోపల ఎన్నో తప్పుడు పనులు చేసే వారే నిజమైన vikalaangulu. మనము thamaashaku anukuntaamu gaani వారు ఎంత bhadha padathaaro ఈ ఉదంతము చూస్తేనే మనకు అర్థము అవుతుంది
కనుక ప్రతి ఒక్కరు తమంతకు తాముగా ఈ జాడ్యాన్ని రూపు మాపడానికి తమ ప్రయత్నము చేయాలని కోరుతున్నాను .

Monday, August 31, 2009

ఎంసెట్ -పిల్లల పాలిట భూతమా

పిల్లలను బడిలో వేసినప్పటినుండే వారు ఇంజనీర్లుకావలెనా ,డాక్టర్లు కావలెనా అని తల్లిదండ్రులు ఆశించడము జరుగుతూఉంది . కాని వారి అభిరుచులు ఎలా ఉన్నాయ్ ,వారి ప్రతిభ ఏ విషయంలో ఉన్నది గమనించడము లేదు . పెద్దల కోరికలకు అనుగుణంగా నడవాలనే ఒక కనుపించని ఒత్తిడి పిల్లల కు అది నుండే కలిగించు చున్నాం .
వారు తమ శక్తి మేరకు ప్రయత్నించుతారు.అందులో చాల మంది పిల్లలు విఫలం అయ్యే ఆస్కారం ఉంది . తల్లిదండ్రుల ఆశలను సొమ్ము చేసికోవడానికి కార్పోరీట్ కాలేజిలు సదా సిద్దంగా ఉంటాయి .ఎంత డబ్బు ఖర్చు ఐన సరే అనుకునే తల్లిదండ్రుల కోరికలను వారు సొమ్ము చేసికొంటారు . కాలేజిలో చేర్పించింది మొదలు వాళ్ల ప్రతాపము చూపెడతారు . తిండికి నిద్రకు పిల్లలు మొహం వాచే తట్లుగా తయారు అయిపోతారు . ఈ నిరంతర శ్రమను భరించలేని పిల్లలు కొంత మంది తల్లిదండ్రులతో గోడు వెల్లబోసుకుంటారు . కాని మెజారిటీ తల్లిదండ్రులు
విషయతీవ్రతను గుర్తించక వారిని బుజ్జగించి మళ్ళీ అదే కాలేజి లో చేర్పించుతారు .ఫలితంగానే నేడు మనము అత్యంత భాదాకరమైన పిల్లల ఆత్మహత్యలను చూడవలిసి వస్తున్నది . ఈ పరిస్థితికి కేవలము యజమాన్యమును తప్పు పట్టడము సరైనది కాదు .కార్పొరేటు కాలేజిలో ఎలా చదివిస్తారో అందరికి తెలుసు . కాని మనమే కోరి కోరి
పిల్లలను అక్కడ చేర్పించు తున్నాము .కాని పిల్లలకు తగిన మానసిక ధైర్యాన్ని మనము కలిగించి నట్లయ్తే వారు
సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోగాలుగుతారు .ఎప్పుడయినా ,ఎవరైనా ,ఎపనియినా ఇష్టంగా చేయాలి . అప్పుడు కష్టం అనిపించదు .ఆ దృక్పథాన్ని పిల్లలకు మనము కలిగించి నట్లైతే ఇక వారికి తిరుగేలేదు .
జయహో

Saturday, August 29, 2009

తెలుగు భాష -కన్నతల్లి

నేడు తెలుగు భాషాదినోత్సవం . తెలుగు వారమైన మనమంతా తెలుగు గురించి ఆనంధపడవలిసిన సమయమిది .
కానీ మన పిల్లలును గురించి తలచుకుంటే భాద కలుగుతూ ఉంది . ఎందుకంటే ఇప్పుడు ఎక్కువమంది ఇంగ్లీష్
మీడియం లో చదివే వారే ఉన్నారు . ప్రభుత్వము కూడా క్రొత్తగా ఇంగ్లీష్ బడులను ప్రోత్సహిస్తూంది .మరి పిల్లలు
ఇంగ్లీష్ చదివినట్లుగా తెలుగు చదవలేకపోతున్నారు .పేపర్ చదవమంటే నత్తులుకోడుతూ చదువుతారు .ఇక తెలుగు
సంవత్సరాల గురించి అడిగితే బిక్కమొగమేస్తారు . దీనికి కారణము ఎవరని అడిగితే తిలా పాపము తల పిడికెడు
అని అనవలసి వస్తుంది .బడిలో వారు ఎంతసేపు మార్కులగురించే ఆలోచించుతారు తప్పితే మన సంస్కృతి ,భాష
గురించి చెప్పారు . కనీసం ఇంటిలో మనమైనా వారికి ఎంతోకొంత చెప్పవలిసిన అవసరము ఎంతైనా ఉంది .ఇంగ్లీష్ ను
తక్కువ చేయడము నా ఉద్దేశ్యము కాదు కన్నతల్లి ని ఎలా మరచి పోలేమో ఆలాగు మన మాతృభాషను మరచిపోరాదన్నది నా ఉద్దేశ్యము .

Monday, August 10, 2009

ఆనందం అంబరమైతే

హలో నేను చెప్పాలనుకున్నది తేటతెలుగులో ఇలా వ్రాస్తున్నదుకు ఎంత ఆనందంగా ఉందొ చెప్పలేను .ఎందుకటే మనము మన భాషలో చెప్పినట్లు వేరే భాష లో చెప్పలేము . తెలుగు వారె తెలుగు మరచి పోతున్న ఈ రోజులలో తెలుగులో ఇలా వ్రాసుకోవడము మనసుకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో అది అనుభవించిన వారికే తెలుస్తుంది .ఈరోజుకు ఇది చాలు .