Monday, August 31, 2009

ఎంసెట్ -పిల్లల పాలిట భూతమా

పిల్లలను బడిలో వేసినప్పటినుండే వారు ఇంజనీర్లుకావలెనా ,డాక్టర్లు కావలెనా అని తల్లిదండ్రులు ఆశించడము జరుగుతూఉంది . కాని వారి అభిరుచులు ఎలా ఉన్నాయ్ ,వారి ప్రతిభ ఏ విషయంలో ఉన్నది గమనించడము లేదు . పెద్దల కోరికలకు అనుగుణంగా నడవాలనే ఒక కనుపించని ఒత్తిడి పిల్లల కు అది నుండే కలిగించు చున్నాం .
వారు తమ శక్తి మేరకు ప్రయత్నించుతారు.అందులో చాల మంది పిల్లలు విఫలం అయ్యే ఆస్కారం ఉంది . తల్లిదండ్రుల ఆశలను సొమ్ము చేసికోవడానికి కార్పోరీట్ కాలేజిలు సదా సిద్దంగా ఉంటాయి .ఎంత డబ్బు ఖర్చు ఐన సరే అనుకునే తల్లిదండ్రుల కోరికలను వారు సొమ్ము చేసికొంటారు . కాలేజిలో చేర్పించింది మొదలు వాళ్ల ప్రతాపము చూపెడతారు . తిండికి నిద్రకు పిల్లలు మొహం వాచే తట్లుగా తయారు అయిపోతారు . ఈ నిరంతర శ్రమను భరించలేని పిల్లలు కొంత మంది తల్లిదండ్రులతో గోడు వెల్లబోసుకుంటారు . కాని మెజారిటీ తల్లిదండ్రులు
విషయతీవ్రతను గుర్తించక వారిని బుజ్జగించి మళ్ళీ అదే కాలేజి లో చేర్పించుతారు .ఫలితంగానే నేడు మనము అత్యంత భాదాకరమైన పిల్లల ఆత్మహత్యలను చూడవలిసి వస్తున్నది . ఈ పరిస్థితికి కేవలము యజమాన్యమును తప్పు పట్టడము సరైనది కాదు .కార్పొరేటు కాలేజిలో ఎలా చదివిస్తారో అందరికి తెలుసు . కాని మనమే కోరి కోరి
పిల్లలను అక్కడ చేర్పించు తున్నాము .కాని పిల్లలకు తగిన మానసిక ధైర్యాన్ని మనము కలిగించి నట్లయ్తే వారు
సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోగాలుగుతారు .ఎప్పుడయినా ,ఎవరైనా ,ఎపనియినా ఇష్టంగా చేయాలి . అప్పుడు కష్టం అనిపించదు .ఆ దృక్పథాన్ని పిల్లలకు మనము కలిగించి నట్లైతే ఇక వారికి తిరుగేలేదు .
జయహో

Saturday, August 29, 2009

తెలుగు భాష -కన్నతల్లి

నేడు తెలుగు భాషాదినోత్సవం . తెలుగు వారమైన మనమంతా తెలుగు గురించి ఆనంధపడవలిసిన సమయమిది .
కానీ మన పిల్లలును గురించి తలచుకుంటే భాద కలుగుతూ ఉంది . ఎందుకంటే ఇప్పుడు ఎక్కువమంది ఇంగ్లీష్
మీడియం లో చదివే వారే ఉన్నారు . ప్రభుత్వము కూడా క్రొత్తగా ఇంగ్లీష్ బడులను ప్రోత్సహిస్తూంది .మరి పిల్లలు
ఇంగ్లీష్ చదివినట్లుగా తెలుగు చదవలేకపోతున్నారు .పేపర్ చదవమంటే నత్తులుకోడుతూ చదువుతారు .ఇక తెలుగు
సంవత్సరాల గురించి అడిగితే బిక్కమొగమేస్తారు . దీనికి కారణము ఎవరని అడిగితే తిలా పాపము తల పిడికెడు
అని అనవలసి వస్తుంది .బడిలో వారు ఎంతసేపు మార్కులగురించే ఆలోచించుతారు తప్పితే మన సంస్కృతి ,భాష
గురించి చెప్పారు . కనీసం ఇంటిలో మనమైనా వారికి ఎంతోకొంత చెప్పవలిసిన అవసరము ఎంతైనా ఉంది .ఇంగ్లీష్ ను
తక్కువ చేయడము నా ఉద్దేశ్యము కాదు కన్నతల్లి ని ఎలా మరచి పోలేమో ఆలాగు మన మాతృభాషను మరచిపోరాదన్నది నా ఉద్దేశ్యము .

Monday, August 10, 2009

ఆనందం అంబరమైతే

హలో నేను చెప్పాలనుకున్నది తేటతెలుగులో ఇలా వ్రాస్తున్నదుకు ఎంత ఆనందంగా ఉందొ చెప్పలేను .ఎందుకటే మనము మన భాషలో చెప్పినట్లు వేరే భాష లో చెప్పలేము . తెలుగు వారె తెలుగు మరచి పోతున్న ఈ రోజులలో తెలుగులో ఇలా వ్రాసుకోవడము మనసుకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో అది అనుభవించిన వారికే తెలుస్తుంది .ఈరోజుకు ఇది చాలు .